కర్ణాటక నూతన సీఎం డీకే శివకుమార్ అన్ని పాఠశాలలు, కళాశాలల విద్యార్థులకు ఉచిత బస్సు పాస్ లు అందజేస్తామని తెలిపారు. ఎటువంటి ఛార్జీలు లేకుండా వీటిని అందజేసేందుకు తన నేతృత్వంలోని క్యాబినెట్ తొలి నిర్ణయం తీసుకుందన్నారు. విద్యార్థులు దీని కోసం దరఖాస్తు చేసుకోవాలని.. ఈ పథకం గురించి రవాణా శాఖతో చర్చిస్తామని తెలిపారు. ప్రభుత్వ పోస్టుల భర్తీకి క్యాలెండర్ విడుదల చేస్తామని.. ప్రైవేటు ఎంప్లాయిమెంట్ ఎక్స్ఛేంజ్ ను కూడా ఏర్పాటు చేస్తామని తెలిపారు.