loader

ఢిల్లీపై చెన్నై ఘన విజయం

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో చెన్నై బౌలర్ల కట్టుదిట్టమైన బౌలింగ్‌ను ఎదుర్కోలేక 155 పరుగులకే పరిమితమైంది. అనంతరం 156 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్, ఆది నుంచే దూకుడుగా ఆడింది. ముఖ్యంగా ఓపెనర్ శాంసన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. కేవలం 52 బంతుల్లోనే 87 పరుగులు చేసి అజేయంగా నిలిచారు. ఆయన ఇన్నింగ్స్‌లో 6 భారీ సిక్సర్లు, 7 ఫోర్లు ఉండటం గమనార్హం.శాంసన్ ధాటికి ఢిల్లీ బౌలర్లు […]

కోల్‌కతా డీసీపీ శంతను సిన్హాపై ఈడీ లుకౌట్ నోటీసులు.. మనీ లాండరింగ్ కేసులో జారీ

కోల్‌కతా డీసీపీ శంతను సిన్హా బిశ్వాస్‌పై ఈడీ లుకౌట్ నోటీసులు జారీ చేసింది. మనీ లాండరింగ్ కేసులో విచారణకు హాజరుకాకపోవడంతో ఈడీ నోటీసులు ఇచ్చింది. శంతను దేశం విడిచి వెళ్లకుండా చూడాలని ఈడీ నోటీసుల్లో పేర్కొంది. అతడికి ఇప్పటికే పలుమార్లు విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీ చేసినప్పటికీ అతడు హాజరుకాకపోవడంతో లుకౌట్ నోటీసులు ఇచ్చినట్లు ఈడీ తెలిపింది.  అల్లర్లు, హత్యాయత్నం, దోపిడీ కోణం, నేర కుట్రలకు సంబంధించి సోనా పప్పు కేసులో శంతను సిన్హా బిశ్వాస్‌కు ప్రమేయం ఉన్నట్లుగా […]

టీఎంసీలో ‘టికెట్ల’ బేరం.. ఒక్కొక్కటి రూ. 5 కోట్లు: మాజీ మంత్రి మనోజ్ తివారీ

పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో మాజీ క్రికెటర్, మాజీ మంత్రి మనోజ్ తివారీ చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి. తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో టికెట్లను అమ్ముకుంటున్నారని ఆయన ఆరోపించారు. “ఈ ఎన్నికల్లో సుమారు 70 నుండి 72 మంది అభ్యర్థులు ఒక్కొక్కరు రూ. 5 కోట్లు ఇచ్చి టికెట్లు కొనుక్కున్నారు. నన్ను కూడా అదే మొత్తం అడిగారు, కానీ అక్రమంగా డబ్బులు ఇచ్చి పోటీ చేయడం ఇష్టం లేక నేను నిరాకరించాను. అందుకే నాకు షిబ్‌పూర్ టికెట్ […]

ఇంటర్ అడ్మిషన్ల షెడ్యూల్ తాత్కాలికంగా రద్దు

రాష్ట్రంలో జూనియర్ కళాశాలల్లో ప్రవేశాలకు ఇంటర్మీడియేట్ బోర్డు విడుదల చేసిన అడ్మిషన్ల షెడ్యూల్‌ను తాత్కాలికంగా రద్దు చేసింది. సోమవారం(మే 4) విడుదల చేసిన అడ్మిషన్ షెడ్యూల్ సర్కులర్‌ను ఉపసంహరించుకుంటున్నట్లు బోర్డు ప్రకటించింది. విద్యా వ్యవస్థలో కీలక సంస్కరణలు, పారదర్శకత కోసం కొత్త మార్గదర్శకాలను రూపొందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. తదుపరి ఆదేశాలు వెలువడే వరకు ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కాలేజీలు ఎలాంటి అడ్మిషన్లు నిర్వహించకూడదని బోర్డు పేర్కొంది.

7న ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం..!

తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన నటుడు జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కజగం(టివికె) పార్టీ.. ప్రభుత్వ ఏర్పాటు కోసం కసరత్తు చేస్తోంది. ఎన్నికల్లో 108 స్థానాల్లో గెలుపొందిన టివికె.. తమిళనాడులో అతి పెద్ద పార్టీగా అవతరించింది. మే 7న తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం చెన్నైలోని జవహర్‌లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో జరిగనున్నట్లు సమాచారం.

విజయ్‌ మా మద్దతు కోరారు: కాంగ్రెస్‌

తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు టీవీకే అధినేత విజయ్‌ 10 సీట్ల దూరంలో నిలిచారు. ఈ క్రమంలోనే ఆయన తమ మద్దతు కోరినట్లు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కేసీ వేణుగోపాల్‌ వెల్లడించారు. విజయ్ అభ్యర్థనపై తుది నిర్ణయం తీసుకోవాల్సిందిగా తమిళనాడు కాంగ్రెస్ కమిటీని (టీఎన్‌సీసీ) పార్టీ అధిష్ఠానం ఆదేశించిందన్నారు. ఈ ఎన్నికల్లో డీఎంకే కూటమి నుంచి పోటీ చేసిన కాంగ్రెస్‌.. ఐదు స్థానాలు దక్కించుకుంది.

అమెరికా విమానం మిస్సింగ్.. ఖతార్ పరిధిలో

గాలిలోనే ఇంధనం నింపగల సామర్ధ్యం ఉన్న అమెరికాకు చెందిన విమానం ఒకటి కనిపించకుండా పోయింది. బోయింగ్ కేసీ–135 స్ట్రాటోట్యాంకర్ అనే ఫ్లయింగ్ గ్యాస్ స్టేషన్‌గా పిలిచే విమానం ఇరాన్ సమీపంలోని పర్షియన్ గల్ఫ్ తీరంలో ప్రయాణిస్తుండగా గల్లంతైంది. గల్లంతు కావడానికి కొద్దిసేపటి ముందు ఎమర్జెన్సీ సిగ్నల్ అందించింది. ఒకపక్క మిడిల్ ఈస్ట్‌లో యుద్ధ సంక్షోభం నెలకొన్నదృష్ట్యా ఈ విమానం కనిపించకుండా పోవడం ఆసక్తికరంగా మారింది.

జై శ్రీరామ్ అంటే పైసలు పడతాయా? -కొండా సురేఖ వివాదాస్పద వ్యాఖ్యలు

తెలంగాణ మంత్రి కొండా సురేఖ మరోసారి తన వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. బీజేపీ నేతలు కేవలం మతపరమైన నినాదాలకే పరిమితమవుతున్నారని, రాష్ట్ర ప్రయోజనాలను విస్మరిస్తున్నారని ఆమె మండిపడ్డారు. బీజేపీనాయకులను ఉద్దేశించి చేసిన ప్రశ్నలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. “మీటింగ్ పెట్టి జై శ్రీరామ్ అనడం తప్ప.. రాష్ట్రానికి తెచ్చిన నిధులు ఏవి?” అంటూ ఆమె సూటిగా ప్రశ్నించారు. శ్రీరాముడి నామధేయాన్ని కించపరిచేలా ఆమె మాట్లాడారని, కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఇలాంటి వ్యాఖ్యలు […]

రాజీనామాకు మమత నో.. ఇప్పుడేం జరగనుంది?

పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన మమతా బెనర్జీ సీఎం పదవికి రాజీనామా చేయబోనని భీష్మించారు. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయంటూ ఆమె ఆరోపిస్తున్నారు. మరి సీఎం పదవికి మమత రాజీనామా చేయకపోతే తర్వాత ఏమవుతుంది? నిబంధనలు ఏం చెప్తున్నాయి? రాజ్యాంగంలోని ఆర్టికల్ 164 ప్రకారం.. ముఖ్యమంత్రిని గవర్నర్ నియమిస్తారు. ఒకవేళ మెజారిటీ కోల్పోయిన ముఖ్యమంత్రి రాజీనామా చేయకపోతే గవర్నర్‌కు వారిని తొలగించే అధికారం ఉంటుంది.

ఇండిగో విమానంలో మంటలు.. తప్పిన పెను విమాన ప్రమాదం

హైదరాబాద్ నుంచి చండీగఢ్ వెళ్లిన ఇండిగో విమానంలో పెను ప్రమాదం తప్పింది. మంగళవారం (మే 5) విమానం చండీగఢ్ విమానాశ్రయంలో ల్యాండ్ అయిన తర్వాత ఒక ప్రయాణికుడి వ్యక్తిగత ఎలక్ట్రానిక్ పరికరంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో విమానంలోని ప్రయాణికులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. మంటలను గమనించిన క్యాబిన్ సిబ్బంది తక్షణమే స్పందించి, మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అందరినీ విమానం నుంచి ఖాళీ చేయించి టెర్మినల్‌కు సురక్షితంగా తరలించారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON