కోల్కతా డీసీపీ శంతను సిన్హా బిశ్వాస్పై ఈడీ లుకౌట్ నోటీసులు జారీ చేసింది. మనీ లాండరింగ్ కేసులో విచారణకు హాజరుకాకపోవడంతో ఈడీ నోటీసులు ఇచ్చింది. శంతను దేశం విడిచి వెళ్లకుండా చూడాలని ఈడీ నోటీసుల్లో పేర్కొంది. అతడికి ఇప్పటికే పలుమార్లు విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీ చేసినప్పటికీ అతడు హాజరుకాకపోవడంతో లుకౌట్ నోటీసులు ఇచ్చినట్లు ఈడీ తెలిపింది. అల్లర్లు, హత్యాయత్నం, దోపిడీ కోణం, నేర కుట్రలకు సంబంధించి సోనా పప్పు కేసులో శంతను సిన్హా బిశ్వాస్కు ప్రమేయం ఉన్నట్లుగా ఆరోపణలున్నాయి.