తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన నటుడు జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కజగం(టివికె) పార్టీ.. ప్రభుత్వ ఏర్పాటు కోసం కసరత్తు చేస్తోంది. ఎన్నికల్లో 108 స్థానాల్లో గెలుపొందిన టివికె.. తమిళనాడులో అతి పెద్ద పార్టీగా అవతరించింది. మే 7న తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం చెన్నైలోని జవహర్‌లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో జరిగనున్నట్లు సమాచారం.