పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన మమతా బెనర్జీ సీఎం పదవికి రాజీనామా చేయబోనని భీష్మించారు. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయంటూ ఆమె ఆరోపిస్తున్నారు. మరి సీఎం పదవికి మమత రాజీనామా చేయకపోతే తర్వాత ఏమవుతుంది? నిబంధనలు ఏం చెప్తున్నాయి? రాజ్యాంగంలోని ఆర్టికల్ 164 ప్రకారం.. ముఖ్యమంత్రిని గవర్నర్ నియమిస్తారు. ఒకవేళ మెజారిటీ కోల్పోయిన ముఖ్యమంత్రి రాజీనామా చేయకపోతే గవర్నర్కు వారిని తొలగించే అధికారం ఉంటుంది.