గాలిలోనే ఇంధనం నింపగల సామర్ధ్యం ఉన్న అమెరికాకు చెందిన విమానం ఒకటి కనిపించకుండా పోయింది. బోయింగ్ కేసీ–135 స్ట్రాటోట్యాంకర్ అనే ఫ్లయింగ్ గ్యాస్ స్టేషన్‌గా పిలిచే విమానం ఇరాన్ సమీపంలోని పర్షియన్ గల్ఫ్ తీరంలో ప్రయాణిస్తుండగా గల్లంతైంది. గల్లంతు కావడానికి కొద్దిసేపటి ముందు ఎమర్జెన్సీ సిగ్నల్ అందించింది. ఒకపక్క మిడిల్ ఈస్ట్‌లో యుద్ధ సంక్షోభం నెలకొన్నదృష్ట్యా ఈ విమానం కనిపించకుండా పోవడం ఆసక్తికరంగా మారింది.