రాష్ట్రంలో జూనియర్ కళాశాలల్లో ప్రవేశాలకు ఇంటర్మీడియేట్ బోర్డు విడుదల చేసిన అడ్మిషన్ల షెడ్యూల్‌ను తాత్కాలికంగా రద్దు చేసింది. సోమవారం(మే 4) విడుదల చేసిన అడ్మిషన్ షెడ్యూల్ సర్కులర్‌ను ఉపసంహరించుకుంటున్నట్లు బోర్డు ప్రకటించింది. విద్యా వ్యవస్థలో కీలక సంస్కరణలు, పారదర్శకత కోసం కొత్త మార్గదర్శకాలను రూపొందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. తదుపరి ఆదేశాలు వెలువడే వరకు ప్రభుత్వ,
ప్రైవేట్ జూనియర్ కాలేజీలు ఎలాంటి అడ్మిషన్లు నిర్వహించకూడదని బోర్డు పేర్కొంది.