loader

మేడారంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి అవమానం.. మొక్కులు చెల్లించకుండా ఈడ్చుకెళ్లిన పోలీసులు..!

మేడారం జాతరలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కి అవమానం జరిగింది. కుటుంబంతో కలిసి సమ్మక్క, సారలమ్మలను దర్శించుకొని.. చెల్లించుకోవాలనుకున్న ఆయనను పోలీసులు అడ్డుకున్నారు. దాంతో కౌశిక్ రెడ్డి తనను ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. అయినా సరే పోలీసులు ఆయన మాట వినలేదు. పోలీసుల వైఖరిని ఖండించిన ఆయన వాగ్వాదానికి దిగారు. అంతలోనే పోలీసులు  చుట్టూచేరి ఎమ్మెల్యేను బలవంతంగా అక్కడి నుంచి ఈడ్చుకెళ్లారు.

Prism అనే సరికొత్త ఫీచర్‌ను తీసుకొచ్చిన OpenAI..

AI-ఆధారిత వర్క్‌స్పేస్ ప్రిజం అనే సరికొత్త ఫీచర్‌ను ఓపెన్‌ఏఐ ప్రవేశపెట్టింది. శాస్త్రవేత్తలు పరిశోధనలను ఎలా రాస్తారు, ఎలా ప్రచురిస్తారు అనే వాటిని సరళీకృతం చేయడానికి దీన్ని రూపొందించారు. పరిశోధకులు సమీకరణాలు, సూచనలు, బొమ్మల పూర్తి సందర్భోచిత అవగాహనతో పత్రాలను రూపొందించవచ్చు, సవరించవచ్చు. ఈ ప్లాట్‌ఫామ్ రియల్-టైమ్ సహకారం, సాహిత్య ఆవిష్కరణ, సమీకరణ నిర్వహణకు మద్దతు ఇస్తుంది. చేతితో రాసిన రేఖాచిత్రాలను LaTeXగా మారుస్తుంది.  హ్యాండ్స్-ఫ్రీ మార్పుల కోసం వాయిస్-ఆధారిత ఎడిటింగ్‌ను కూడా అందిస్తుంది.

రూ.11,500 కోట్ల సైబర్ మోసాలు.. ఒకే కుటుంబంలో 11 మందికి మరణశిక్ష అమలు

మయన్మార్ కేంద్రంగా వేల కోట్ల రూపాయల ఆన్‌లైన్ మోసాలు, గ్యాంబ్లింగ్, హత్యలకు పాల్పడుతున్న మింగ్ కుటుంబానికి చెందిన 11 మంది సభ్యులకు మరణశిక్ష అమలు చేసినట్లు చైనా ప్రభుత్వం ఒక సంచలన ప్రకటన విడుదల చేసింది. ఈ మింగ్ ముఠా తమ వద్ద పనిచేస్తూ తప్పించుకునేందుకు ప్రయత్నించిన 14 మంది చైనీయులను కిరాతకంగా చంపేసింది. 2015 నుంచి మింగ్ గ్యాంగ్ గ్యాంబ్లింగ్, ఆన్‌లైన్ ఫ్రాడ్ 11,500 కోట్లకు పైమాటేనని తెలుస్తోంది. మయన్మార్‌లోని కోకాంగ్ ప్రాంతంలో ఈ కుటుంబం […]

హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో సిఎం రేవంత్‌రెడ్డి సందడి

హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో సిఎం రేవంత్‌రెడ్డి సందడి చేశారు. తన పర్యటనలో భాగంగా సిఎం పలు కీలక సమావేశాలు, అంతర్జాతీయ సంస్థలతో చర్చలు, విద్యార్థులతో ముఖాముఖీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముఖ్యంగా ప్రముఖ హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో భారతీయ విద్యార్థులతో జరిగిన భేటీ కార్యక్రమం అనేక వర్గాల్లో చర్చకు దారితీసింది. భారతీయ విద్యార్థుల ప్రత్యేక ఆహ్వానంతో క్యాంపస్‌ను సిఎం రేవంత్ సందర్శించారు. విజన్ తెలంగాణను గ్లోబల్ మ్యాప్‌లో అగ్రస్థానంలో నిలబెట్టడమే తన ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

అందులో ఏ మాత్రం నిజంలేదు.. ఆ ప్రచారంపై CP సజ్జనార్ క్లారిటీ!

రోజురోజుకూ పెరుగుతున్న బంగారం రేట్లు నేపథ్యంలో నగరంలో చైన్ స్నాచింగ్‌లు విపరీతంగా పెరిగిపోయాయని, అంతర్రాష్ట్ర ముఠాలు హైదరాబాద్‌లో మకాం వేశాయంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ వీసీ సజ్జనార్‌ రియాక్ట్ అయ్యారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టం చేశారు. జనాలు ఇలాంటి మెసేజ్‌లను నమ్మొద్దని ‘ఎక్స్‌’ వేదికగా పోస్ట్ చేశారు.

జగన్‌కు అధికారం సరికాదు – గతంలో ఇస్తే ఏం చేశారు: వైఎస్ షర్మిల

వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌ పాదయాత్ర చేయనున్నట్లు ప్రకటించడంపై ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల స్పందించారు. అధికారం కోసమే జగన్ పాట్లు అంటూ ఎద్దేవా చేశారు. విజయవాడ ఆంధ్రరత్న భవన్లో నిర్వహంచిన మీడియా సమావేశంలో షర్మిళ మాట్లాడుతూ అధికారం ఇస్తే ఏం చేశారని ప్రశ్నించారు. జలయజ్ఞం పూర్తి చేయగలిగారా, నవరత్నాల్లో పెట్టిన హామీలను అమలు చేశారా, మద్యనిషేధం అమలు చేశారా అంటూ నిలదీశారు.

రేపు హజరవ్వలేను.. ఎర్రవల్లిలోనే సిట్ విచారణ చేయాలి..!

ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ నోటీసులపై బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ (KCR) స్పందించారు. సిట్ అధికారులు నోటీసులో పేర్కొన్న రోజున తాను విచారణకు హాజరు కాలేనని ఆయన తెలిపారు. నందినగర్‌లోని తన నివాసంలో అధికారులు నోటీసులు ఇవ్వడంపై గులాబీ అధినేత ప్రత్యుత్తరం రాశారు. శుక్రవారం విచారణ కుదరని ఆయన పోలీసులకు వివరించారు. అంతేకాదు తనను ఎర్రవల్లిలోనే మరోరోజు విచారణ చేయాలని కేసీఆర్ లేఖలో పేర్కొన్నారు.

వనం వీడి జనంలోకి సమ్మక్క – గౌరవసూచకంగా గాల్లోకి ఎస్పీ కాల్పులు

మేడారం జాతరలో కీలక ఘట్టం రానే వచ్చింది. వనం (చిలకలగుట్ట) వీడి జనంలోకి సమ్మక్క ఆగమనం ప్రారంభమైంది. సమ్మక్క తల్లికి గౌరవసూచకంగా గాల్లోకి ఎస్పీ రాంనాథ్​ కేకన్​ కాల్పులు జరిపారు. పోలీసులు సమ్మక్క తల్లికి గౌరవవందనం సమర్పించారు. ఆ తల్లికి మంత్రులు సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ ఘనస్వాగతం పలికారు. భక్తులు సమ్మక్కకు జై అంటూ నినాదాలు చేశారు. భక్తుల జయజయధ్వానాలతో సమ్మక్క కాసేపట్లో గద్దెలపైన కొలువుదీరనుంది. బుధవారమే సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెలపై కొలువుదీరారు.

ఎల్లుండి వన ప్రవేశం చేయనున్న తల్లులు…ఇప్పటి వరకు 80 లక్షల మంది దర్శనం

ఇప్పటి వరకు దాదాపు 80 లక్షల మంది భక్తులు మేడారం సమ్మక్క-సారలమ్మలను దర్శనం చేసుకున్నారని మేడారం సమ్మక్క–సారక్క మహా జాతరలో భక్తుల తాకిడి గతంలో ఎన్నడూ లేనంతగా పెరిగిందని రాష్ట్ర రెవెన్యూ, శాఖ మంత్రి పొంగులేటి తెలిపారు.మేడారం జాతర శాశ్వత అభివృద్ధి కోసం29 ఎకరాల భూమిని సేకరించామని మరో 41 ఎకరాల భూసేకరణ ప్రక్రియ కొనసాగుతోందని మంత్రి శనివారం సాయంత్రం 4 గంటలకు తల్లులు గద్దెల నుంచి తిరిగి వనప్రవేశం చేయనున్నారని, అప్పటివరకు భక్తులు ఓపికతో దర్శనాలు […]

తమిళనాడులో ఎస్ఐఆర్‌‌పై సుప్రీంకోర్టు జోక్యం.. ఈసీకి కీలక ఆదేశాలు

తమిళనాడులో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ అంశంపై సుప్రీంకోర్టు గురువారం జోక్యం చేసుకుంది. ఓటర్ల జాబితా సవరణ పారదర్శకంగా, సజావుగా సాగేలా వ్యవహరించాలని కేంద్ర ఎన్నికల కమిషన్‌కు సూచించింది. ప్రభుత్వ కార్యాలయాలలో ‘తార్కిక వ్యత్యాసాల’ జాబితాలోని ఓటర్ల పూర్తి జాబితాను ప్రచురించాలని, పేర్లు లేనివారు 10 రోజుల్లోపు సంబంధిత పత్రాలను సమర్పించడానికి అనుమతించాలని ఈసీని ఆదేశించింది. రాష్ట్రంలోని ఎస్ఐఆర్ అనంతరం 97 లక్షల ఓట్లను తొలగించారు..

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON