ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ నోటీసులపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) స్పందించారు. సిట్ అధికారులు నోటీసులో పేర్కొన్న రోజున తాను విచారణకు హాజరు కాలేనని ఆయన తెలిపారు. నందినగర్‌లోని తన నివాసంలో అధికారులు నోటీసులు ఇవ్వడంపై గులాబీ అధినేత ప్రత్యుత్తరం రాశారు. శుక్రవారం విచారణ కుదరని ఆయన పోలీసులకు వివరించారు. అంతేకాదు తనను ఎర్రవల్లిలోనే మరోరోజు విచారణ చేయాలని కేసీఆర్ లేఖలో పేర్కొన్నారు.

