మేడారం జాతరలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కి అవమానం జరిగింది. కుటుంబంతో కలిసి సమ్మక్క, సారలమ్మలను దర్శించుకొని.. చెల్లించుకోవాలనుకున్న ఆయనను పోలీసులు అడ్డుకున్నారు. దాంతో కౌశిక్ రెడ్డి తనను ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. అయినా సరే పోలీసులు ఆయన మాట వినలేదు. పోలీసుల వైఖరిని ఖండించిన ఆయన వాగ్వాదానికి దిగారు. అంతలోనే పోలీసులు చుట్టూచేరి ఎమ్మెల్యేను బలవంతంగా అక్కడి నుంచి ఈడ్చుకెళ్లారు.

