ఇప్పటి వరకు దాదాపు 80 లక్షల మంది భక్తులు మేడారం సమ్మక్క-సారలమ్మలను దర్శనం చేసుకున్నారని మేడారం సమ్మక్క–సారక్క మహా జాతరలో భక్తుల తాకిడి గతంలో ఎన్నడూ లేనంతగా పెరిగిందని రాష్ట్ర రెవెన్యూ, శాఖ మంత్రి పొంగులేటి తెలిపారు.మేడారం జాతర శాశ్వత అభివృద్ధి కోసం29 ఎకరాల భూమిని సేకరించామని మరో 41 ఎకరాల భూసేకరణ ప్రక్రియ కొనసాగుతోందని మంత్రి శనివారం సాయంత్రం 4 గంటలకు తల్లులు గద్దెల నుంచి తిరిగి వనప్రవేశం చేయనున్నారని, అప్పటివరకు భక్తులు ఓపికతో దర్శనాలు చేసుకోవాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.

