మేడారం జాతరలో కీలక ఘట్టం రానే వచ్చింది. వనం (చిలకలగుట్ట) వీడి జనంలోకి సమ్మక్క ఆగమనం ప్రారంభమైంది. సమ్మక్క తల్లికి గౌరవసూచకంగా గాల్లోకి ఎస్పీ రాంనాథ్ కేకన్ కాల్పులు జరిపారు. పోలీసులు సమ్మక్క తల్లికి గౌరవవందనం సమర్పించారు. ఆ తల్లికి మంత్రులు సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ ఘనస్వాగతం పలికారు. భక్తులు సమ్మక్కకు జై అంటూ నినాదాలు చేశారు. భక్తుల జయజయధ్వానాలతో సమ్మక్క కాసేపట్లో గద్దెలపైన కొలువుదీరనుంది. బుధవారమే సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెలపై కొలువుదీరారు.

