నగరానికి చెందిన బీ టెక్ విద్యార్థి గుజ్జా మణిదీప్ రెడ్డి ఫిన్లాండ్లో అదృశ్యమైన ఘటన విషాదాంతమైంది. గత మే నెల 5వ తేదీ నుంచి కనిపించకుండా పోయిన మణిదీప్ మృతదేహం జూలై 9వ తేదీన సముద్రంలో లభ్యమైనట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. క్రూనువోరెన్రాంటా వాటర్ ఫ్రంట్ ప్రాంతంలో అతని మృతదేహాన్ని గుర్తించారు. మణిదీప్ మృతికి గల కారణాలపై ఫిన్లాండ్ నేషనల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ దర్యాప్తు ప్రారంభించింది. అయితే, ఈ ఘటనలో ఎలాంటి నేరపూరిత కోణం కనిపించడం లేదని అధికారులు ప్రాథమికంగా స్పష్టం చేశారు.