కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల ప్రకారం, జూన్లో జీఎస్టీ వసూళ్లు 13.9 శాతం పెరిగి రూ.1.95 లక్షల కోట్లకు చేరాయి. దేశీయ లావాదేవీల ద్వారా వచ్చిన స్థూల వసూళ్లు 6.5 శాతం పెరిగి రూ.1.35 లక్షల కోట్లుగా నమోదవగా, దిగుమతుల ద్వారా వచ్చిన ఆదాయం 34.6 శాతం పెరిగి రూ.60,038 కోట్లకు చేరింది. జూన్ లో నికర వసూళ్లు 11.2 శాతం పెరిగి రూ.1.62 లక్షల కోట్లకు పైగా చేరాయి