నాగార్జున సాగర్-శ్రీశైలం పులి అభయారణ్యం భారతదేశంలోని ముఖ్యమైన పులి సంరక్షణ కేంద్రాల్లో ఒకటి. గతేడాది ఇక్కడ 90 పులులు నమోదయ్యాయి. ఇందులో 32 మగ, 40 ఆడ పులులు ఉన్నాయి. జులై నుంచి సెప్టెంబర్ మధ్య కాలం పులుల పునరుత్పత్తికి అత్యంత అనుకూలమైన సమయం.పులుల సంతానోత్పత్తి కాలం కావడంతో వాటికి ఏకాంతం కల్పించడమే ఈ ఆంక్షల వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం.ఈ మూడు నెలల కాలంలో జంగిల్ సఫారీలు పూర్తిగా నిలిపివేశారు. మార్కాపురం, ఆత్మకూరు, నంద్యాల అటవీ డివిజన్లలోని సఫారీ సేవలు రద్దు చేశారు