యూట్యూబర్ రావణ్‌ను ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు అతడిని హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలకు సంబంధించిన కేసులో రావణ్ అరెస్ట్ జరిగినట్టుగా తెలుస్తోంది. వివరాలు…. ఏలూరు దళిత క్రైస్తవుల సభలో పాల్గొన్న యూట్యూబర్ రావణ్ తన ప్రసంగంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఇందుకు సంబంధించి కాకినాడ జిల్లా పిఠాపురంపోలీసులకు ఫిర్యాదు అందింది.