ఆలయ విరాళాల లెక్కింపు గది నుంచి భారీగా నగదును అపహరించి, దానిని ఎవరికీ అనుమానం రాకుండా ఆలయ ప్రాంగణంలోని వాష్‌రూముల్లో తాత్కాలికంగా దాచిపెట్టేవారని దర్యాప్తులో తేలింది. ఆ తర్వాత ట్రస్ట్ కీలక సభ్యులతో ఉన్న సాన్నిహిత్యం కారణంగా నిందితులను ఆలయ భద్రతా సిబ్బంది పెద్దగా అనుమానించలేదు.అనుకూలమైన పరిస్థితులు చూసుకుని, ఎవరికీ అనుమానం రాకుండా ఆ సొమ్మును క్రమంగా బయటకు తరలించేవారని సమాచారం.ఈ వ్యవహారంలో శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ మాజీ సభ్యుల ప్రమేయంపై అనుమానాలు బలంగా వినిపిస్తున్నాయి.