వంటగ్యాస్ వినియోగదారులకు భారీ ఊరట లభించింది. వాణిజ్య అవసరాల కోసం వినియోగించే 19 కేజీల సిలిండర్ ధరలు తగ్గాయి. ఒక్కో సిలిండర్‌పై ఏకంగా రూ. 183.50 పైసల మేర తగ్గింది. తగ్గిన రేట్లు ఈ తెల్లవారు జాము నంచి అమలులోకి వచ్చాయి. కిందటి నెలలో ఒక్కో సిలిండర్ పై ఏకంగా 993 రూపాయల అదనపు మొత్తం పెరిగింది. దీంతో పోల్చుకుంటే ఇప్పుడు తగ్గిన భారం చాలా తక్కువే.డొమెస్టిక్ వంటగ్యాస్ సిలిండర్ల రేట్లు కూడా తగ్గిస్తారని ఆశించిన వారికి నిరాశే ఎదురైంది. పాత రేట్లే కొనసాగుతున్నాయి