యాదగిరిగుట్ట దేవస్థానం కొత్త పాలక మండలిని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. యాదగిరిగుట్ట ట్రస్ట్ బోర్డు ఛైర్మన్‌గా ఎం సత్యనారాయణ రెడ్డిని నియమించింది. యాదగిరిగుట్ట ట్రస్ట్ బోర్డులో పది మందికి సభ్యులుగా చోటు కల్పించింది. అలాగే, వివిధ శాఖలకు చెందిన పలువురు ఉన్నతాధికారులను ఎక్స్ అఫీషియో సభ్యులుగా నియమించింది. యాదగిరిగుట్ట పాలకమండలిలో మెంబర్స్‌గా ఎమ్మెల్యే వినోద్, ప్రముఖ సినీ నటుడు చిరంజీవి సతీమణి కొణిదెల సురేఖ, మాజీ మంత్రి దేవేందర్ గౌడ్ కొడుకు విజయేందర్ గౌడ్‌తో సహా పలువురికి చోటు కల్పించారు.