పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లో పాక్ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా గత 22 రోజులుగా కొనసాగుతున్న నిరసనలు తీవ్ర రూపం దాల్చాయి. LOC సమీపంలోని రావల్కోట్ ప్రాంతంలో భారీ ఎత్తున జరిగిన ఆందోళన కార్యక్రమంలో వేలాది మంది స్థానికులు పాల్గొన్నారు.
‘పీవోకే అసలు పాకిస్థాన్లో భాగం కాదు. మాకు పాకిస్థాన్ అవసరమే లేదు. వారికి మా అవసరం ఉంది’ అని స్పష్టంగా హెచ్చరించారు. పాక్ ప్రభుత్వం ఆహార సరఫరాలపై ఆంక్షలు కొనసాగిస్తే ‘ఇతర మార్గాలు’ (భారత్తో సన్నిహిత సంబంధాలు) వెతికేందుకు సిద్ధమవుతామని జేఏఏసీ నేతలు