జన్మతః పౌరసత్వ హక్కు రద్దు విషయంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు అమెరికా సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. బర్త్ రైట్ సిటిజన్‌షిప్‌ను రద్దుచేస్తూ వెలువరించిన కార్యనిర్వహాక ఉత్తర్వులను ఆ దేశ సర్వోన్నత న్యాయస్థానం వ్యతిరేకించింది. జన్మతః పౌరసత్వ హక్కు ఉండాల్సిందేనని స్పష్టం చేసింది. కేవలం ఒక సంతకంతో పుట్టుకతో వచ్చే పౌరసత్వం నిర్వచనాన్ని ట్రంప్ మార్చలేరని న్యాయమూర్తులు స్పష్టం చేశారు. దీంతో చట్టాన్ని రద్దుచేయడానికి ట్రంప్ చేసిన ప్రయత్నాలకు గండిపడింది.