భారత రక్షణ పరిశోధన సంస్థ (డీఆర్‌డీఓ) కొత్త డైరెక్టర్ జనరల్‌గా ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ జగన్నాథ్ నాయక్‌ను నియమితులయయారు. రక్షణ పరిశోధన రంగంలో 35 ఏళ్లకు పైగా విశేష అనుభవం కలిగిన డాక్టర్ జగన్నాథ్ నాయక్, దేశ రక్షణ సామర్థ్యాన్ని పెంపొందించే అనేక కీలక ప్రాజెక్టుల్లో తన ముద్ర వేశారు. దేశీయంగా అభివృద్ధి చేసిన తొలి డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్ వ్యవస్థ రూపకల్పనలో ఆయన కీలక పాత్ర పోషించారు. అలాగే ఆకాశ్ క్షిపణి వ్యవస్థకు సంబంధించిన ఫైబర్ ఆప్టిక్ గైరో గైడెన్స్ టెక్నాలజీ, ఆధునిక యాంటీ డ్రోన్ వ్యవస్థల అభివృద్ధిలోనూ ఆయన చేసిన సేవలు విశేష గుర్తింపు పొందాయి.