హైదరాబాద్లోని శిల్పకళావేదికపై నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు భరోసా నిధులను విడుదల చేశారు. తొలి విడతలో 2,482.02 కోట్ల రూపాయల నిధులు రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. ఈ దఫా 44.28 లక్షల మంది రైతులు లబ్ధిదారులకు నిధులు అందజేయనున్నారు. అందరికీ ఒకేసారి కాకుండా తొలి రోజు ఒక ఎకరం భూమి కలిగి ఉన్న 14.65 లక్షల మంది రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తారు. తర్వాత రెండు ఎకరాల వరకు భూమి ఉన్న రైతుల ఖాతాల్లో నిధులు జమ చేస్తారు.