దేశంలో ఇప్పటికే వర్షపాతం లోటు కనిపిస్తోంది. జూన్‌లో తగినంతగా వర్షాలు కురవలేదు. జూలైలోనైనా భారీ వర్షాలు కురుస్తాయని ఆశిస్తున్న వారికి షాకిచ్చే ప్రకటన చేసింది భారత వాతావరణ సంస్థ ఐఎండీ. జూలైలో సాధారణం కంటే తక్కువ వర్షపాతమే నమోదవుతుందని ప్రకటించింది. పసిఫిక్ భూమధ్య రేఖ వద్ద ఎల్‌నినో బలపడటం వల్ల ఈ పరిస్థితి ఉంటుందని ఐఎండీ తెలిపింది. ఇప్పటికే జూన్‌లో 39 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. 1901 తర్వాత 125 ఏళ్లలో ఈ స్థాయిలో జూన్‌లో లోటు వర్షపాతం నమోదు కావడం ఇది ఐదోసారి