శ్రీకాకుళం జిల్లాలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ చుట్టూ తిరుగుతున్న వివాదం రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యల కేసులో విచారణ ఎదుర్కొంటున్న ఆయన, తాజాగా అదృశ్యం కావడం తీవ్ర కలకలం రేపుతోంది. పోలీస్ స్టేషన్‌కు బయలుదేరి రెండు గంటలు గడుస్తున్నా ఆయన అక్కడకు చేరుకోకపోవడంతో ఏం జరిగిందనే ఉత్కంఠ నెలకొంది. దీనిపై ఆయన సన్నిహితురాలు దివ్వెల మాధురి స్పందిస్తూ… దువ్వాడను పోలీసులే అరెస్ట్ చేసి ఉంటారని ఆరోపిస్తున్నారు. అయితే ఈ ఆరోపణలను కొత్తూరు పోలీసులు తీవ్రంగా ఖండించారు.