హైదరాబాద్‌లోని ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీ బోధి పేవిలియన్‌లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధులతో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రజలకు మెరుగైన అత్యవసర వైద్య సేవలు అందించేందుకు ఏర్పాటు చేసిన రెండు అంబులెన్స్‌లను ముఖ్యమంత్రి జెండా ఊపి ప్రారంభించారు. అలాగే భూపాలపల్లి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన అత్యాధునిక ఎంఆర్ఐ (MRI) యంత్రాన్ని వర్చువల్ విధానంలో ప్రారంభించారు.