విజయనగరం జిల్లా భోగాపురం మండల కేంద్రంలోని ప్రతిష్టాత్మక ‘పీఎంశ్రీ ఏపీ మోడల్ స్కూల్’ను కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో కలిసి మంత్రి లోకేష్ క్షేత్రస్థాయిలో సందర్శించారు. పాఠశాలలో అమలు చేస్తున్న ఆధునిక డిజిటల్ విద్యా బోధన పద్ధతులను, మౌలిక వసతులను కేంద్ర, రాష్ట్ర మంత్రులు అత్యంత ఆసక్తిగా పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న స్టూడెంట్ ప్రోగ్రెస్ కార్డ్, అసెస్ మెంట్ బుక్ లెట్ మరియు యూనిఫాం, స్కూల్ బ్యాగ్, బుక్స్, షూస్ నాణ్యతను కేంద్ర మంత్రికి చూపించారు.