రాష్ట్రంలో గత రెండు రోజులుగా రిజిస్ట్రేషన్ సేవలు నిలిచిపోయాయి. సర్వర్ పనిచేయకపోవడంతో స్లాట్ బుకింగ్, ఇతర సేవలకు అంతరాయం కలుగుతోంది. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో క్రయ విక్రయదారులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. గత మూడు నెలల్లో ఇలా జరగడం నాలుగోసారి. సాంకేతిక సమస్య ఎందుకు పరిష్కారం చేయడం లేదని ప్రశ్నిస్తున్నారు. చాలా మంది మంచి రోజు, పక్కాగా ముహూర్తం చూసుకుని మరీ రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. అయితే గత రెండు రోజులుగా సర్వర్ పూర్తిగా నిలిచిపోవడంతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల వద్ద పడిగాపులు కాస్తున్నారు.