తెలంగాణ ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించబోతున్న సంజయ్ జాజు సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కొత్త సీఎస్ కు శుభాకాంక్షలు తెలిపి.. రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఈ భేటీలో ఈ రోజు రిటైర్డ్ కాబోతున్న ప్రస్తుత సీఎస్ రామకృష్ణారావు కూడా ఉన్నారు. సంజయ్ జాజు మరికాసేపట్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించబోతున్నారు.