20 శాతం ఇథనాల్ కలిపిన పెట్రోల్ విషయంలో కేంద్రం వాహనదారులకు ఇవాళ భారీ షాకిచ్చింది. ప్రస్తుతం 20 శాతం నుంచి 85 శాతం వరకూ ఇథనాల్ కలిపిన వాహనాల్ని ప్రారంభించేందుకు అనుమతులు ఇచ్చేస్తుున్న కేంద్రం.. ఓవైపు ఇథనాల్ కలిపిన పెట్రోల్ వాడకం వల్ల ఇంధన భద్రత, రైతులు, పర్యావరణానికి మేలు జరుగుతుందని ఊదరగొడుతున్న కేంద్రం.. ఇవాళ దీన్ని కేవలం ప్రయోగాత్మక దశలోనే ఉందని సుప్రీంకోర్టుకు చెప్పడం చర్చనీయాంశంగా మారింది. ఇథనాల్ బ్లెండింగ్ ప్రభావం వచ్చే ఏడాది నాటికి స్పష్టమవుతుందని సుప్రీంకోర్టుకు తెలిపింది.