ప్రభుత్వం ఉద్యోగులు, పింఛన్దారుల దీర్ఘకాలిక బకాయిల చెల్లింపుల కోసం మరో రూ.2 వేల కోట్లను విడుదల చేస్తూ సర్కార్ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. పదవీ విరమణ చేసిన ఉద్యోగులు, జిల్లా పరిషత్ ఉపాధ్యాయులకు సంబంధించిన జనరల్ ప్రావిడెంట్ ఫండ్ బకాయిలను వంద శాతం చెల్లించి, పెండింగ్ బిల్లులు లేకుండా చేసినట్లు ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. గత నెల మే 29న మొదటి విడతగా రెండు వేల కోట్లు, సరిగ్గా నెల రోజుల వ్యవధిలోనే రెండో విడత నిధులను కూడా సర్దుబాటు చేసింది.