సరూర్నగర్ లో భారీ పేలుడు సంభవించింది. రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగి ఇంట్లో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించగా, ప్రమాద తీవ్రతకు ఇల్లు ధ్వంసమైంది. ఇంటి గోడలు, తలుపులు, కిటికీలు అద్దాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. కుటుంబ సభ్యులు ఇంట్లోనే ఉన్నప్పటికీ అదృష్టవశాత్తు ఎవరికీ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. సంఘటన అనంతరం ఇంట్లోని గ్యాస్ స్టౌ, 3 గ్యాస్ సిలిండర్లు, ఫ్రిజ్, గీజర్ తో పాటు ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను పరిశీలించగా, అవన్నీ సురక్షితంగా ఉండటం మరింత మిస్టరీగా మారింది. ఇంట్లో అగ్ని ప్రమాదం ఆనవాళ్లు కూడా కనిపించలేదు.