సిఎం రేవంత్ ఎప్పటికీ రైతు ద్రోహిగానే ఉంటారని, సభల పేరుతో కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని అన్నారు. రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ఎక్స్ లో కెటిఆర్ విమర్శలు చేశారు. రైతు భరోసా ఎగ్గొట్టడమే కాకుండా మళ్లీ సభల పేరిట నాటకాలా? అని కెటిఆర్ ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వ పిఆర్ స్టంట్లు చూసి రైతులు అసహ్యించుకున్నారని, దాదాపు 30 వేల కోట్ల రైతు భరోసా ఎగ్గొట్టారని ఇప్పటికీ రూ.2 లక్షల రుణమాఫీ చేయలేదని మండిపడ్డారు. రైతుకు వెన్నుపోటు ఎన్నటికీ క్షమించే ప్రసక్తే లేదని కెటిఆర్ హెచ్చరించారు.