ప్రముఖ నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్ తన రాజకీయ ప్రవేశంపై గత కొద్దిరోజులుగా సాగుతున్న ఊహాగానాలకు, ప్రచారానికి ఎట్టకేలకు తెరదించారు. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని TVK పార్టీ తరఫున తాను తిరుచ్చి ఈస్ట్ నియోజకవర్గం నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నానంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఆయన ఘంటాపథంగా స్పష్టం చేశారు. తన మాటలను కొందరు తప్పుగా అర్థం చేసుకుని ప్రచారం చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.