డీజీపీ హోదా ఉన్న పి.వి.సునీల్ కుమార్ మంగళవారం నాడు ఆయన ఉద్యోగ విరమణ చేయబోతుండగా.. సస్పెన్షన్ మాత్రమే ఎత్తివేస్తూ, రిటైర్డ్ అయ్యేందుకు సర్వీస్ రిలీవ్ చేసింది. అయితే, ఉద్యోగ విరమణ అనంతరం వచ్చే ప్రయోజనాలు మాత్రం, ఆయనపై నమోదైన కేసుల విచారణ కొలిక్కి వచ్చాకే ఉంటాయని స్పష్టం చేసింది. పి.వి.సునీల్ ఉద్యగ విరమణ అనంతరం వచ్చే ప్రయోజనాలు ఆపాలని అతడి భార్య అరుణ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు.2017లో అరుణ వరకట్నం, గృహ హింస కేసు పెట్టి దూరంగా ఉంటూ వస్తున్నారు.