తెలంగాణ ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా సంజయ్ జాజు మంగళవారం సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వహించిన కే. రామకృష్ణా రావు ఈ రోజు పదవీ విరమణ చేయడంతో, ఆయన స్థానంలో 1992 బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ అధికారి సంజయ్ జాజు నూతన సీఎస్ గా బాధ్యతలు చేపట్టారు.ఈ సందర్భంగా సంజయ్ జాజుతో పాటు కే. రామకృష్ణా రావును ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు,సచివాలయ అధికారులు, సిబ్బంది పుష్పగుచ్ఛాలతో అభినందించారు.