వైసీపీ మాజీ మంత్రి కొడాలి నానికి ఇవాళ హైకోర్టులో భారీ ఊరట లభించింది. వైసీపీ హయాంలో నమోదైన ఓ ఎన్నికల కేసులో ఆయనపై కూటమి సర్కార్ తదుపరి చర్యలు తీసుకోకుండా హైకోర్టు ఇవాళ స్టే మంజూరు చేసింది. 2021 ఫిబ్రవరిలో స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ అమలులో ఉండగా విపక్ష నేత చంద్రబాబు, ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ పై మంత్రిగా ఉన్న కొడాలి నాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీనిపై నిమ్మగడ్డ రమేశ్ కొడాలి నానిపై ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసు పెట్టారు.