అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రాజోలు మండలం చింతలపల్లి గ్రామంలోని పోతుమట్ల ప్రాంతంలో గత 12 రోజులుగా కరెంటు లేకపోవడంతో గ్రామస్తులు అవస్థలు పడుతున్నారు. రెండు తుఫాన్ల ప్రభావంతో గోదావరి జిల్లాల్లో విద్యుత్ వ్యవస్థకు అంతరాయం ఏర్పడినప్పటికీ, చుట్టుపక్కల ప్రాంతాల్లో సరఫరాను అధికారులు పునరుద్ధరించారు. అయితే తమ ప్రాంతంలో మాత్రం ఇప్పటికీ విద్యుత్ సరఫరా అందకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామస్తులు రాజోలులోని విద్యుత్ శాఖ ఏడీఈ కార్యాలయం వద్ద సెల్ఫోన్ టార్చ్లైట్లు వెలిగిస్తూ నిరసన తెలిపారు.