బ్రిటన్‌కు చెందిన ‘ది టైమ్స్’ పత్రిక కథనం ప్రకారం.. ఇరాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖకు చెందిన ఓ అధికారి అణు కేంద్రాలకు సమీపంలో నివసించే ప్రజలకు అయోడిన్ మాత్రలు పంపిణీ చేస్తున్నట్లు వెల్లడించారు. యుద్ధ పరిస్థితులు నెలకొన్న ప్రతిసారీ అణు కేంద్రాల చుట్టూ 2 నుంచి 3 కిలోమీటర్ల పరిధిలోని ప్రజలకు ఈ మాత్రలను అందించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. డొనాల్డ్ ట్రంప్‌పై నమ్మకం లేదని, ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చెప్పలేమని ఆ అధికారి వ్యాఖ్యానించినట్లు కథనం పేర్కొంది.