అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు భారత వ్యాపారవేత్త విశాల్ గొండల్ అరుదైన బహుమతిని అందజేశారు. దీపావళి వేడుకల సందర్భంగా ట్రంప్‌కు హిందువులు అత్యంత భక్తిశ్రద్ధలతో పఠించే హనుమాన్ చాలీసా ప్రతిని కానుకగా ఇచ్చారు. ఆధ్యాత్మిక ప్రాధాన్యత కలిగిన గ్రంథాన్ని అమెరికా అధ్యక్షుడికి అందించడం తనకు ఎంతో గర్వకారణమని ట్రంప్‌తో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొనడం గౌరవంగా భావిస్తున్నానని సోషల్ మీడియా వేదికగా తన ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా హనుమాన్ చాలీసా బహుమతిగా ఇవ్వడం వెనుక ఉన్న ఆధ్యాత్మిక భావనను కూడా వివరించారు.