నటి అతుల్య డాక్టర్‌పై దాడి చేసి రూ. 3.5 లక్షల దోచుకున్నారనే వ్యవహారం ఇప్పుడు చికిత్స పేరుతో తనకు మత్తుమందు ఇచ్చి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని నటి బంధువు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ కేసు కొత్త మలుపు తిరిగింది. సదరు వైద్యుడిపైనే పోలీసులు తాజాగా అత్యాచారం కేసు నమోదు చేశారు. బంధువుకు వైద్యుడు నిరంతరం ఫ్లాట్‌కు వచ్చి చికిత్స అందించేవాడు. అయితే, అలా వచ్చిన సమయంలోనే డాక్టర్ తనకు మత్తు మందు ఇచ్చి లైంగికంగా వేధించాడని బాధితురాలు ఇటీవల నటికి తెలిపింది.