ఓపెన్ స్కూల్ ద్వారా పదవ తరగతి, ఇంటర్మీడియట్ కోర్సుల్లో ప్రవేశాల గడువును పొడిగించారు. ఎలాంటి అపరాధ రుసుము లేకుండా నవంబర్ 15వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించినట్లు అన్నమయ్య జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ కె. సుబ్రహ్మణ్యం తెలిపారు. ఓపెన్ స్కూల్ పదవ తరగతిలో ప్రవేశం పొందాలంటే అభ్యర్థికి కనీసం 14 సంవత్సరాల వయస్సు నిండి ఉండాలి. పదవ తరగతి ఉత్తీర్ణులైన వారు ఇంటర్మీడియట్ కోర్సులో ప్రవేశం పొందేందుకు అర్హులు