మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ బుధవారం జనసేన పార్టీలో చేరారు. ఆయనతో పాటు తిరుపతికి చెందిన ప్రణీత్ ప్రమోద్ కూడా జనసేన కండువా కప్పుకున్నారు. రాజధాని అమరావతిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయవాడ మేయర్ రేసులో వంగవీటి రాధాకృష్ణ, తిరుపతి మేయర్ రేసులో ప్రణీత్ ప్రమోద్ జనసేన అభ్యర్థులుగా బరిలోకి దిగే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.