ఢిల్లీ యూనివర్శిటీలో విద్యాభ్యాసం చేస్తున్న కేరళకు చెందిన అథిరా అనే విద్యార్థిని.. పోలీసుల దాడిలో వినికిడి శక్తి కోల్పోయిందంటూ మండిపడ్డారు. ఈ అమ్మాయికి జరిగిన నష్టానికి ఎవరు బాధ్యత వహిస్తారని రాహుల్ నిలదీశారు. అమ్మాయిలను అరెస్ట్ చేసిన సందర్భంలో ఓ లేడీ కానిస్టేబుల్ వెంట ఉండాలి కదా.. అని ప్రశ్నించాను. దీనిపై కోప్పడ్డ పోలీసులు.. ఆపకుండా చెంపదెబ్బలు కొట్టారు. ఈ దాడిలో నా కంటికి, చెవికి తీవ్రగాయాలయ్యాయి. ఒక చెవి వినికిడి శక్తిని కోల్పోయింది’ అని అథిరా ఆవేదన చెందారు.