దసరా, దీపావళి పండగల వేళ కేంద్రం రైల్వే ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. వీరికి బోనస్ చెల్లించేందుకు కేంద్ర క్యాబినెట్ గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. 78 రోజుల వేతనాన్ని ‘ఉత్పాదకతతో ముడిపడిన బోనస్’ (PLB) రూపంలో చెల్లించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయంతో దాదాపు 11.40లక్షల మంది నాన్-గెజిటెడ్ రైల్వే ఉద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది. ఈ బోనస్ చెల్లింపుల కోసం నిధులు కేటాయించింది. రైల్వే పనితీరును మెరుగుపరిచేలా ఉద్యోగుల్ని ప్రోత్సహించడానికి ఈ బోనస్ చెల్లింపు ఉపయోగపడుతుందని రైల్వే మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది.