ఉత్తరప్రదేశ్లోని మీరట్లో గతేడాది జరిగిన వివాహేతర సంబంధం హత్య కేసులో కోర్టు నిందితులకు కఠిన శిక్ష విధిస్తూ సంచలన తీర్పు వెల్లడించింది. బ్లూ డ్రమ్ హత్య కేసుగా ఫేమస్ అయిన హత్య కేసులో జిల్లా,సెషన్స్ న్యాయమూర్తి అరవింద్ కుమార్ మిశ్రా దోషులు ముస్కాన్ రస్తోగి, సాహిల్ శుక్లాలకు మరణశిక్ష విధించింది. గతేడాది మార్చి 3న సౌరబ్ రాజ్పూత్ని హతమార్చిన కేసులో కోర్టు ఇప్పటి వరకు 126 సార్లు విచారించింది. మరణశిక్ష పడిందనే బాధ వాళ్ల ముఖంలో కనిపించలేదని సౌరబ్ రాజ్పూజ్ కుటుంబ సభ్యులు అంటున్నారు.