మజ్జి శ్రీనివాసరావు ఫిరాయింపు వెనుక టీడీపీ ఇచ్చిన ఎమ్మెల్సీ, మంత్రి పదవి హామీ ఉందన్న ప్రచారం జోరుగా జరుగుతోంది. అదే సమయంలో మజ్జిని ఎమ్మెల్సీని చేసి, మంత్రిని చేస్తే తాను గవర్నర్ పదవికి రాజీనామా చేస్తానంటూ అశోక్ గజపతిరాజు టీడీపీ అధిష్టానానికి తేల్చిచెప్పారన్న ప్రచారం కూడా జరిగింది. మజ్జి శ్రీను కుమార్తె సహస్రతో కలిసి గజపతి రాజు వద్దకు వెళ్లారు
ముఖ్యంగా మజ్జి శ్రీనుకు టీడీపీ ఇచ్చిన హామీ మేరకు ఎమ్మెల్సీ, మంత్రి పదవులు ఇచ్చేందుకు అశోక్ అడ్డుపడకుండా ఆయనతో చర్చించినట్లు సమాచారం.