నిర్మల్ జిల్లా ఎస్పీ డాక్టర్ జి. జానకి షర్మిలపై కొంతమంది స్వార్థపూరిత శక్తులు చేస్తున్న ఆరోపణలు, సామాజిక మాధ్యమాల్లో వస్తున్న ప్రచారాలు పూర్తిగా అవాస్తవమని, వాస్తవాలకు దూరంగా ఉన్నాయని నిర్మల్ జిల్లా పోలీస్ సంక్షేమ సంఘం తేల్చి చెప్పింది. వాస్తవాలను వక్రీకరిస్తూ ఎస్పీపై దుష్ప్రచారం చేయడం సరికాదని పేర్కొంటూ సంఘం ఒక ప్రకటన విడుదల చేసింది. మచ్చలేని సర్వీస్ కలిగిన మహిళా ఐపీఎస్ అధికారిణి ఎస్పీ జానకి షర్మిలకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని స్పష్టం చేసింది.