నిరుద్యోగ యువత జీవితాలతో రాజకీయాలు చేయకూడదని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వ ఉద్యోగాలపై తప్పుడు ప్రచారాలు చేస్తూ యువత ఆశలను నాశనం చేస్తున్నారని ఆమె తీవ్రంగా మండిపడ్డారు. మెగా డీఎస్సీని వదలకుండా టార్గెట్ చేస్తున్న వైసీపీ చేసేవి తప్పుడు ఆరోపణలు, వారు చేస్తున్నవి తప్పుడు ప్రచారాలని ఆమె పేర్కొన్నారు. కష్టపడి చదువుకుని, పరీక్షలు రాసి ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న యువతీయువకుల భవిష్యత్తుతో ఆటలాడటం సమంజసం కాదని హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు.

