loader

తొలి మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం

అఫ్గానిస్థాన్ తో జరిగిన తొలి టీ20 సమరంలో భారత క్రికెట్ జట్టు 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఓపెనర్ అభిషేక్ శర్మ 82 పరుగులతో వీరవిహారం చేయడంతో ప్రత్యర్థి నిర్దేశించిన లక్ష్యాన్ని భారత్ కేవలం 13.4 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి 157 పరుగులు చేసి సునాయాసంగా ఛేదించింది. కేవలం 32 బంతులు మాత్రమే ఎదుర్కొన్న అభిషేక్ 7 ఫోర్లు, 7 భారీ సిక్సర్ల సాయంతో 256.25 స్ట్రైక్ రేట్‌తో ఏకంగా 82 పరుగులు, మరోవైపు ఇషాన్ కిషన్ 33 బంతుల్లో […]

ఏఐ కంపెనీలు సూపర్‌ ఇంటెలిజెన్స్‌ను సృష్టిస్తున్నాయి!

గూగుల్ డీప్ మైండ్ పరిశోధకుడు జోష్ ఎంగెల్స్ కూడా ఏజీఐ సేఫ్టీ టీం నుంచి వైదొలిగినట్లు ప్రకటించారు. ఏఐ సామర్థ్యాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. తగిన చర్యలు తీసుకోకుంటే తీవ్రమైన నష్టం వాటిల్లుతుంది. ఏఐ కంపెనీలు సూపర్ ఇంటెలిజెన్స్ ను సృష్టిస్తున్నాయి. ఇప్పటికే కొన్ని కంపెనీల సిస్టమ్లు హ్యాక్ అవ్వడం వంటి ఘటన చోటుచేసుకుంటున్నాయి. ఇది ప్రస్తుతం తీవ్రమైన సమస్య కానప్పటికీ రానున్న కొన్నేళ్లలో ప్రపంచంలో అతి పెద్ద సమస్యగా మారనుంది’ అని జోష్ ఎంగెల్స్ ఆందోళన […]

ముగిసిన బ్రిక్స్.. తిరుగు ప్రయాణమైనా నేతలు

ఢిల్లీలోని భారత్ మంటపంలో రెండు రోజుల పాటు అత్యంత వైభవంగా జరిగిన 18వ బ్రిక్స్ (BRICS) శిఖరాగ్ర సదస్సు ఆదివారంతో విజయవంతంగా ముగిసింది. సదస్సు ముగియడంతో వేడుకల్లో పాల్గొన్న వివిధ దేశాల అగ్రనేతలు తమ స్వదేశాలకు తిరుగుప్రయాణమయ్యారు. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్,ఇప్పటికే ఢిల్లీ నుంచి బయలుదేరారు. అంతర్జాతీయ ఆర్థిక వ్యవహారాలు, సఫారీ ప్రాంతీయ భద్రత మరియు ఉమ్మడి సవాళ్లపై కీలక చర్చల అనంతరం ఈ సదస్సు ముగియడం గమనార్హం.

ద్వైపాక్షిక భేటీలతో మోడీ బిజీబిజీ..

్రిక్స్ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రపంచ నేతలతో ఆదివారం వరుసగా సమావేశాలు జరిపారు. దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసా, ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు ఫెర్డినాండ్ మార్కోస్ జూనియర్, ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతాహ్ ఎల్-సిసీలతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. వాణిజ్యం, పెట్టుబడుల సంబంధాలను బలోపేతం చేయడంపై ప్రధానంగా చర్చించారు. కజకిస్థాన్ అధ్యక్షుడు కస్సిమ్-జోమార్ట్ టోకయేవ్, ఇండేనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో, బరుండి అధ్యక్షుడు ఎవారిస్ట్ న్దాయిషిమియే, ఉగాండా ఉపాధ్యక్షురాలు జెస్సికా అలుపో, సహా పలువురు […]

ఇల్లు పోయింది.. టవలే మిగిలింది: ఉక్రెయిన్‌ స్టార్‌

రష్యా, ఉక్రెయిన్ల మధ్య యుద్ధ వాతావరణం కొనసాగుతూనే ఉంది. తాజాగా రష్యా క్షిపణి దాడిలో.. ఉక్రెయిన్ టెన్నిస్ ప్లేయర్ డయానా యాస్ట్రెమ్కోకు చెందిన అపార్ట్మెంట్ ధ్వంసమైంది. అయితే, తన కుటుంబ సభ్యులకు ఎలాంటి ముప్పు వాటిల్లలేదని సోషల్ మీడియా వేదికగా ఆమె తెలిపింది. అపార్ట్మెంట్ కాలిపోతున్న వీడియో, ఫొటోలను పోస్టు చేసింది. కేవలం ఫ్రెంచ్ ఓపెన్ సమయంలో తాను వినియోగించిన టవల్ మాత్రమే మిగిలిందని పేర్కొంది.

ప్రధాని మోదీని కలిసిన క్లాస్‌మేట్‌..తన భూమి ఆక్రమణపై సీబీఐ విచారణ

ప్రధాని మోదీని ఆయన క్లాస్‌మేట్‌ కలుసుకున్నారు. బిల్డర్‌ సంస్థలు తన భూమిని ఆక్రమించినట్లు ఆయన ఆరోపించారు. చాలా కాలంగా వివాదం కొనసాగుతున్న ఈ అంశంపై సీబీఐతో విచారణ జరిపించాలని కోరారు. ఈ మేరకు ఒక లేఖను మోదీకి అందజేశారు. 1989లో భయందర్ ఈస్ట్‌లో 2,810 చదరపు మీటర్ల భూమిని తాను రిజిస్టర్డ్ ఒప్పందం ద్వారా చట్టబద్ధంగా కొనుగోలు చేసినట్లు వోహ్రా తెలిపారు. బీజేపీ ఎమ్మెల్యే నరేంద్ర మెహతాకు అనుబంధంగా ఉన్న బిల్డర్లు నకిలీ పత్రాలతో తన ఆస్తిని […]

అఫ్గనిస్థాన్‌తో తొలి టీ20.. వైభవ్ బెంచ్ మీదే..!

స్వదేశంలో అఫ్గనిస్థాన్‌తో మూడు టీ20ల సిరీస్‌ కాసేపట్లో మొదలవ్వనుంది. టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ బౌలింగ్ తీసుకున్నాడు. అందరూ ఊహించినట్టే వైభవ్ సూర్యవంశీ బెంచ్‌కే పరిమితయ్యాడు. రెగ్యులర్ ఓపెనర్ సంజూ శాంసన్‌ను పక్కన పెట్టడంపై విమర్శలు వస్తున్న వేళ.. ఈసారి వైభవ్‌కు తుది జట్టులో చోటు దక్కలేదు. ఫిట్‌నెస్ నిరూపించుకున్న నితీశ్ రెడ్డి, సుందర్, బుమ్రాలు తుది జట్టులోకి రాగా.. వైభవ్ సూర్యవంశీ బెంచ్‌కే పరిమితమయ్యాడు.

పల్నాడు జిల్లాలో విషాదం .. పిడుగుపాటుకు నలుగురు మృతి

ఏపీలోని పల్నాడు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఆదివారం సాయంత్రం పిడుగుపాటు కు గురై నలుగురు మృతి చెందారు. ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. దీనికితోటు ఈదురుగాలులు, పిడుగుల పడుతున్నాయి. ఇందులో భాగంగా నరసరావుపేట నియోజకవర్గంలో పిడుగుపాటుతో నాగమ్మ, వెంకాయమ్మ, వెంకటయ్య, చిన్న కోటేశ్వరావు అనే నలుగురు మృతి చెందారు. ఈ ఘటనలో మూడు ఆటోలు,కొబ్బరి, మామిడి చెట్లు దెబ్బతిన్నాయి .

ఏపీ టెట్‌ ఫలితాలు విడుదల

ఏపీ టెట్ జూన్- 2026 ఫలితాలను మంత్రి నారా లోకేశ్ విడుదల చేశారు. పరీక్ష రాసిన ఇన్ సర్వీస్ టీచర్లలో 51 శాతం మంది, రెగ్యులర్ అభ్యర్థుల్లో 47 శాతం మంది ఉత్తీర్ణత సాధించినట్లు ప్రకటించారు. ఈ ఫలితాలను https:// tet/dsc. apcfss.in లో చూసుకోవచ్చు. వాట్సాప్ ద్వారా 9552300009 నంబర్లోనూ ఫలితాలు తెలుసుకోవచ్చు.

హుటాహుటిన రాజు గారి వద్దకు మజ్జి శ్రీను..

మజ్జి శ్రీనివాసరావు ఫిరాయింపు వెనుక టీడీపీ ఇచ్చిన ఎమ్మెల్సీ, మంత్రి పదవి హామీ ఉందన్న ప్రచారం జోరుగా జరుగుతోంది. అదే సమయంలో మజ్జిని ఎమ్మెల్సీని చేసి, మంత్రిని చేస్తే తాను గవర్నర్ పదవికి రాజీనామా చేస్తానంటూ అశోక్ గజపతిరాజు టీడీపీ అధిష్టానానికి తేల్చిచెప్పారన్న ప్రచారం కూడా జరిగింది. మజ్జి శ్రీను కుమార్తె సహస్రతో కలిసి గజపతి రాజు వద్దకు వెళ్లారు ముఖ్యంగా మజ్జి శ్రీనుకు టీడీపీ ఇచ్చిన హామీ మేరకు ఎమ్మెల్సీ, మంత్రి పదవులు ఇచ్చేందుకు అశోక్ […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON